Tuesday, November 30, 2010

Monday, November 29, 2010

రాంగోపాల్ వర్మ @ ఐడియా


రాంగోపాల్ వర్మ ఏం చేసినా చిత్రంగానే ఉంటాయి. సినిమా మేకింగ్ స్టైల్ విషయంలోనే కాదు, ఒక సినిమా ఎలా ప్రమోట్ చేసుకోవాలనే విషయంలోనూ  ఆయన ఈ తరం దర్శకులకు పెద్ద బాల శిక్ష. కాదు కాదు ఓ గూగుల్. ఓ ఎన్సైక్లోపీడియా. ఓ పక్క 'కథ స్క్రీన్ ప్లే  దర్శకత్వం - అప్పలరాజు' సినిమా తీస్తూనే మరో పక్క 'బెజవాడ రౌడీలు'కు సన్నాహాలు మొదలు పెట్టేసారు. ఎప్పుడో జరగబోయే పెళ్ళికి ఇప్పుడే బాజాలన్నట్లుగా 'బెజవాడ రౌడీలు' ఎప్పుడు తీస్తాడో తెలీదు కాని ఇప్పటి నుంచే ప్రచారం మొదలుపెట్టేసాడు.
సాధారణంగా ఇక్కడ సినిమా ప్రచార శైలి  ఎలా ఉందంటే.. ఓపెనింగ్, షూటింగ్ అంతా అజ్ఞాతంగానే చేస్తారు. ఆడియో ఫంక్షన్ నుంచి ప్రచారం ఊదరగోట్టేస్తారు. రాంగోపాల్ వర్మ దీనికి భిన్నంగా ఉంటారు. వారానికి ఒక్కోపాతను మార్కెట్లో వదులుతూ ఆడియో రిలీజ్ ను కూడా వెరైటీ గా చేస్తున్నారు. ''భలే కొత్తగా ఉందే మీ  ఐడియా'' అంటే @ఇక పబ్లిసిటీ చేయడానికి ఒక కొత్త ఐడియా కూడా మిగలకుండా అన్ని నేనే చేసి పారేస్తాను @ అని చెప్పారు రామ్ గోపాల్ వర్మ నవ్వుతూ. 


నోట్ : రోజుకు ఒక బ్లాగు రాస్తామని హామీ ఇచ్చి 2  రోజులు అనివార్య కారణాల వాళ్ళ గ్యాప్ ఇచ్చాము. క్షమించండి. 

Friday, November 26, 2010

సకుటుంబ సపరివార సమేతంగా




రాజకీయ రంగం తరహాలోనే సినిమా రంగంలో కూడా వారసత్వాలు కామనైపొయాయి. డాక్టర్ కొడుకు డాక్టర్ ఐన్లట్లుగా, హీరో కొడుకు హీరో అయిపొతున్నాడు. ఇది అంతటితో ఆగడం లేదు. అక్కలు, బావలు, బావమరుదులు, తోడళ్లులు, అక్క కొడుకులు, చెల్లెలి కొడుకులు, తమ్ముడి కొడుకులు... ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టు తయారవుతుంది. ఇప్పుడు ఈ లిస్టు కూడా ఎక్కువైపొయింది. చిరంజీవి ఇద్దరు తమ్ముళ్లు, కొడుకు ఆల్రెడీ ఫీల్డులో ఉన్నారు. ఇటీవలే ఆయన పెద్ద చెల్లెలి కొడుకు సాయి ధరంతేజ్  కూడా హీరోగా అరంగెట్రం చేశాడు. మరో మేనల్లుడు కూడా రెడీ అవుతున్నాడు. నాగబాబు కొడుకు ఓ ఏడాదిన్నరలో హీరోగా వచేస్తాడట. ప్రస్తుతం ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.
నాగార్జున కొడుకు, మేనల్లుడు, మేనకోడలు  ఫీల్డులోనే ఉన్నారు. మరో కొడుకు అఖిల్ రేపో మాపో వచేస్తాడు.
ఇక నందమూరి ఫ్యామిలీ గురించి చెప్పేదేముంది. చాలామంది బరిలోనే ఉన్నారు. వెంకటేష్ ఫ్యామిలీ నుంచి రానా రానే వచ్చాడు. ఇంకెవరు వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు.  మహేష్ బాబు అక్కాబావ అందరికీ నిర్మాతలుగా సుపరిచితులే. అక్క మంజుల 'షో', 'కావ్యాస్ డైరీ'  సినిమాల్లో నటించింది. ఆమె భర్త సంజయ్ స్వరూప్ 'ఏ మాయ చేశావే లొ కనిపించారు.
ఇప్పుడు తాజాగా వీల్లిద్దరు.. ఆరంజ్ లో చెర్రీకి అక్కాబావలుగా మెరిశారు.    

Thursday, November 25, 2010

'జగదేక వీరుడు అతిలోకసుందరీ' మళ్లీ వస్తే !



'జగదేక వీరుడు అతిలోకసుందరీ' ఇప్పటి తరానికి కూడా నచ్చే సినిమా. నిత్యం ఊహల్లో విహరించే మనకు ఫాంటసీ సినిమాలంటే ఎప్పటికీ క్రేజే. మళ్లీ ఆ సినిమా తీస్తే ఎలా ఉంటుంది?
శ్రీదేవి లాంటి అందగత్తె దొరకదు కాబట్టి ఆ ప్రతిపాదన విరమించుకోవాల్సిందే. దానికన్నా 'జగదేకవీరుడు అతిలోకసుందరీ కి సీక్వెల్ చేసుకోవడం ఉత్తమం కదూ. ప్రస్తుతం ఆ పనే జరుగుతోంది. 'జగదేకవీరుడు అతిలోకసుందరీ మూల కథా రచయిత శ్రీనివాస చక్రవర్తి ఆల్రెడీ సీక్వెల్ కి స్క్రిప్ట్ రెడీ చేసేశాడు. ఆయన ఊహల్లో హీరో ఎవరో తెలుసా ? రాంచరణ్ తేజ్. చిరంజీవికి - శ్రీదేవికి పుట్టిన (సినిమా ప్రకారం) బిడ్డ అన్నమాట. అశ్వనీదత్ కలల ప్రాజెక్టుల్లో ఈ సీక్వెల్ ఒకటి. మరి ఆయనకు గాని కథ నచ్చితే భవిష్యత్తులో ఆ సీక్వెల్ మనను అలరిస్తుంది. 

పీ ఎస్ : చాలా పనులు అమ్మతో శ్రీకారం చుట్టాలి అనిపిస్తుంది. అయితే ఈ అందమైన బ్లాగుకు అందమైన అమ్మాయితో శ్రీకారం చుట్టాలనిపించింది. అందుకే ఈ బ్లాగుకి ఇలాంటి శ్రీ(దేవి) కారం చుట్టాం.