Sunday, January 30, 2011

నగరం నిద్రపోతున్నపుడు వారు కలిశారు!





'అనుకోకుండా ఒకరోజు' చూస్తే.. ఎప్పుడు స్నాక్స్ తింటూ ఓ వ్యక్తి కనిపిస్తారు. గుర్తుందా..? అందులో హీరోయిన్ చార్మిని రక్షిస్తారు. ఇపుడు ఆ ఇద్దరు .. అంటే జగపతి, ఛార్మి హీరో , హీరోయిన్లుగా తొలిచిత్రం (అందులో హీరో కాదు) రాబోతుంది. ఇగోలు లేని హీరోగా పేరుపొందిన జగపతిబాబుతో నటించడానికి చార్మి ఆసక్తి కనబరిచినట్లు సమాచారం. తాజాగా పరుచూరి బ్రదర్స్‌ సంభాషణలు రాస్తున్న ఆ చిత్రం పేరు 'నగరం నిద్రపోతున్న వేళ'. ఈచిత్రానికి వారి శిష్యుడు ప్రేమ్‌రాజ్‌ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఇండస్ట్రీ బంద్‌ వల్ల కొంత షూటింగ్‌ జరిగి వాయిదా పడింది. ఈనెల 17న తర్వాత మలి షెడ్యూల్‌ మొదలైంది. జగపతిబాబు, చార్మికాంబినేషన్‌లో కొన్ని సన్నివేశాలతోపాటు ఓ పాటను చిత్రించినట్లు తెలిసింది. ఇప్పటికే 40 శాతం పూర్తయినది. ఈ చిత్రాన్ని ప్రముఖ రియల్టర్‌ నంది శ్రీహరి నిర్మిస్తున్నారు







charmi, jagapathi babu

Saturday, January 29, 2011

దొంగల ముఠా : 5 రోజులు, 5 మంది దర్శకులు





రామ్ గోపాల్ వర్మ త్వరలో "దొంగల ముఠా" చిత్రానికి వర్మ కాక ఐదు గురు డైరక్టర్లు పనిచేయనున్నారు .వీరు పూరీ జగన్నాధ్, వివి వినాయిక్, గుణశేఖర్,హరీష్ శంకర్, కృష్ణ వంశీ అంటున్నారు. వీరు ఐదుగురుకీ ఐదు యూనిట్స్ ని కేటాయిస్తారని, ఎవరు పని వారు పూర్తి చేసుకుంటూ వెళ్తారని, కాంబినేషన్ సీన్స్ ను జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.  రామ్ గోపాల్ వర్మ ఈ ఐదుగురుని కో ఆర్డనేట్ చేస్తారు. 


కొసమెరుపు : ఇక ఆ ఐదు రోజులు మీడియా చేసే హడావిడి చూడలేక చావాలి మనం. 



Thursday, January 27, 2011

శ్రీరామరాజ్యం విడుదల జూన్ 10




నందమూరి బాలకృష్ణ, ప్రముఖ దర్శకుడు బాపు కాంబినేషన్ లో రూపొందుతున్న "శ్రీరామ రాజ్యం" చిత్రం జూన్ 10వ తేదీన విడుదల కానుంది.  గతంలో రామారావు గారు నటించిన లవకుశ కళాఖండాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ దృశ్య కావ్యాన్ని తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు బాపు తెలిపారు.  ఆ లవకుశ కంటే  శ్రీరామ రాజ్యం గొప్పగా ఉంది అని ప్రేక్షకులు కొనియాడేలా ఈ సినిమా ఉంటుందని ఆయన చెప్పారు.  శ్రీరాముని జననం నుంచి రావణాసుర సంహారం వరకూ పదినిషాల పాటలో ఆ కథంతా చూపడం సినిమాలో ప్రత్యేక ఆకర్షణ.  


కొసమెరుపు: బాలయ్యను ఆ శ్రీరాముడు కరునిస్తాడా 




balakrishna, sriramarajyam 

Wednesday, January 26, 2011

తెలుగు తెరపై కొత్త మొహాలు (ఫోటోలు)

ఇతరభాషల నుంచి హీరోయిన్ల దిగుమతి మనకు కొత్త కాదు. కానీ ఈ మద్య కొన్నినెలల తేడా తోనే చాలా కొత్త మొహాలు కనిపించాయి. వీరిలో కొందరు ఇప్పటికే ఇతర భాషల్లో సినిమాలు తీస్తుండగా.. ఇంకొందరు కొత్తవాళ్ళు.  ఆ అందాలు దృశ్యరూపం లో మీ కోసం.
చూడండి, డౌన్ లోడ్ చేయండి.



alisha pekha


Garima parnami

Megnaraj


Moulshree sachdeva


Naga sourya

Piaa Bajpai


Sakshi Gulati

Archana gupta


Tuesday, January 25, 2011

హమ్మయ్య! అప్పల్రాజు వచ్చేస్తున్నాడు


కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : అప్పల్రాజు. హారర్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ, కామెడీ హీరో సునీల్. వీళ్ళిద్దరూ కలిసి సినిమా తీస్తే అది సునీల్ సినిమా అవుతుందా? లేక వర్మ సినిమా నా?
     అందరిలోనూ ఇదే ఇంట్రెస్ట్. ఇది కామెడీ సినిమా అని సునీల్ స్టిల్స్ చూస్తే తెలుస్తోంది. అమలాపురం నుంచి వచ్చిన ఒక సినిమా వీరాభిమాని, డైరెక్టర్ గా మారి చేసే హంగామా ఏంటో ఇందులో చూడచ్చు. నేల టికెట్ తో సినిమా  చూసే అప్పల్రాజు, సినిమా బడ్జెట్ మాత్రం కనీసం 50 కోట్లు ఉండాలంటాడు. హైదరాబాద్ లో సముద్రం సెట్ వేస్తె నిర్మాత సొమ్మేం పోయింది అని అనుకొంటాడు. ఇంక ఈ డైరెక్టర్ ల వల్ల కాదులే అని ఫీలయ్యి హైదరాబాద్ వచ్చేస్తాడు. తనే మెగాఫోన్ పడతాడు. 
 తర్వాత మరి ఏం చేసాడు? ఎలా చేసాడు ? అన్నది  ఫిబ్రవరి 4 న చూడండి.

Monday, January 24, 2011

50 ఏళ్ల వయసులో 6 ప్యాక్ బాడీ





తెలుగు సినిమా హీరోల్లో నాగార్జునది ఒక డిఫరెంట్ స్టైల్. పదిహేను సంవత్సరాలుగా ఫిట్నెస్ ను అలాగే కాపాడుకుంటూ వస్తున్నాడు. అందుకే అమ్మాయిల్లో మనవాడికి క్రేజ్. ఇపుడు ఈ పాత విషయాన్ని ఎందుకు చెప్పామంటే నాగార్జున 'డమరుకం'  అనే కొత్త సినిమా తీస్తున్నాడు కదా. అందులో  6  ప్యాక్ బాడీ తో కనిపించానున్నాడట. ఆ పాత్ర అలాంటిది. సినిమా కోసం వంద శాతం నిబద్దతతో కష్ట పడతాడని నాగ్ కు పేరు. ఇలాంటి విషయాలు తెలిసినపుడు అది నిజమే అనిపిస్తుంది. 


కొసమెరుపు : ఒక్క డాన్ సినిమాలో మాత్రం ఎక్కడ తప్పు జరిగిందో... అతడి వయసు స్పష్టంగా బయటపడింది. ఎందుకు నాగ్ అక్కడ తప్పులో కాలేసాడు. 

Nagarjuna, Dhamarukam 

Sunday, January 23, 2011

రామ్ చరణ్ భయపడాలా ? వద్దా?



మగధీరతో శిఖర సమాన విజయాన్ని అందుకున్న రామ్ చరణ్ ఇప్పుడు అయోమయం లో పడ్డాడు. ఆరంజ్ దెబ్బకు ప్రస్తుతం ప్రయోగం చేసే పరిస్థితి లేదు.  పాట చింతకాయ అన్న పర్లేదు కానీ అర్జెంటు ఓ కమర్షియల్ హిట్ కావాలి మనవాడికి. లేకపోతే అన్ని రకాలుగా ఇబ్బందులు తప్పవు. కొంతకాలం క్రితం అంటే ఆరంజ్ కు ముందు గమ్యం క్రిష్.. చరణ్ కు ఓ కథ చెప్పాడు. అయితే అప్పుడు దానిని చరణ్ వాయిదా వేశాడు. ఆరంజ్ అడ్రెస్ లేకుండా పోయాక మళ్లీ క్రిష్ ను పిలిచి ఓకే చేశాడు. అసలు అయోమయమే ఇక్కడ మొదలైంది. క్రిష్ టాలెంట్ పైన నమ్మకం ఉన్నా అతడివి డైరెక్టర్ సినిమాలే కానీ హీరోయిక్ సినిమాలు కావు. ఈ  నేపథ్యంలో చరణ్ అయోమయం లో పడ్డాడు. పోనీ లే హీరోయిజం లేకపోయినా తనలో కొత్త కోణం బయటకు వస్తుంది ఈ సినిమాతో అని సర్ది చెప్పుకుంటున్నాడట . క్రిష్ మాత్రం భయపడకు నే ఇమేజ్ డ్యామేజ్  కాకుండా చూస్తానని మాట ఇచాడట. 
ఇంతకూ ఆ సినిమా టైటిల్ ఏంటో తెలుసా : 'ఆ' (ఇంకా అనుకుంటున్నారు) 


ramcharan, krish

Saturday, January 22, 2011

పాపం పవన్ కళ్యాణ్



పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ - ఇది నిర్మాతగా మారిన పవన్ కళ్యాణ్ స్థాపించిన సిని నిర్మాణ సంస్థ. పేరు మరోసారి చదవండి. ఎందుకంటే ఇపుడు దాని గురించే మనం మాట్లాడుకోవాలి.
'దబాంగ్' బాలీవుడ్లో 2010 ని రికార్డులతో షేక్ చేసిన సినిమా. సల్మాన్ ఖాన్ హీరో గా నటించిన ఆ సినిమాను పులి తో కుప్పకూలిన పవర్ స్టార్ తెలుగులో  చేయాలనుకున్నారు. అంతే కాదు దానిని తాను కొత్తగా నెలకొల్పిన సొంత సినీ నిర్మాణ సంస్థపైనే తీయాలని సంకల్పించారు. 'మిరపకాయ్' తీసిన హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఈ సినిమాను తెలుగు లో రీమేక్ చేయిస్తున్నారు. తనే హీరో.
అసలు విషయం ఏంటంటే 'క్రియేటివ్ వర్క్స్' అని పేరు పెట్టుకుని.. రీమేక్ మీద ఆధారపడటం. అదికూడా తొలి సినిమాకే ఇలాంటి  పొరపాటు చేయడం. ఇదేమి పెద్ద తప్పు కాకపోయినా సినీ జనాలు చెవులు కొరుక్కోవడానికి మాత్రం బాగా పనికొస్తోంది.

pavan kalyan, powerstar

Tuesday, January 11, 2011

హ్యాపీ సంక్రాంతి..

అనివార్య కారణాల వల్ల పదిహేనవ తేదీవరకు ఇందులో అప్ డేట్స్ ఉండవు !
మళ్లీ పదహారో తేది పునర్దర్శనం. 


హ్యాపీ సంక్రాంతి.. 
టీం బ్లాగర్స్ !

Monday, January 10, 2011

చిరుకి ఈ ఏడాది అదృష్టం లేనట్టే



అనుకున్నదొకటి ఐనదొకటి అంటే ఇదే. రాజకీయాల్లోకి వెళ్లిన తమ అభిమాన నటుడు మళ్లీ త్వరలో తెరమీద కనిపిస్తాడు అనుకున్న ఆయన అభిమానులకు నిరాశే మిగిలింది. సమ్మెవల్ల తెలుగు ఇండస్ట్రి ఎన్నడూ ఊహించని రీతిలో ఇబ్బందులు ఎదుర్కొన్నది. సినిమాలన్ని వాయిదా పడ్డాయి. ఆ ఎఫెక్ట్ మెగాస్టార్ పైన కూడా పడింది. దానివల్ల అయన సినిమా ప్రాజెక్ట్ ఇంకా దూరం జరిగింది. ఇంతలో తెలంగాణా గొడవ కూడా కొత్త మలుపు తీసుకోవడంతో రాజకీయాల్లో ఇప్పుడప్పుడే సెలవులు తీసుకునే పరిస్థితి లేదు.  దీంతో 2011 లో   చిరు సినిమా థియేటర్ లకు రావడం సంగతి పక్కన పెడితే అసలు మొదలయ్యే పరిస్థితే కనిపించడం లేదు.



chiru, chiranjeevi

Sunday, January 9, 2011

చాలాకాలం తర్వాత 'యూత్ ఫీల్' సినిమా



కొత్త సంవత్సరం లో తెలుగు సినిమా బోని అద్బుతంగా లేకున్నా.. హాయిగా ఉంది. కొత్త ముఖాలతో వచ్చిన గ్రాడుయేట్ సినిమా చాలాకాలం తర్వాత వచ్చిన ఒక యూత్ఫుల్ ఎంటర్ టైనర్గా ఉంది. కత పాతదే అయినా దర్శకుడు ప్రసాద్ రాయల చేసిన కృషి ఫలించింది. అక్షయ్, తషు కౌశిక్, రితిక సూద్ ల నటన కంటికి ఇంపుగా ఉంది. ఈ సినిమాకు ప్రచారం బాగా చేసినా అది ప్రేక్షకులకు అంతగా ఎక్కలేదు.. కాని ఈ సినిమా యూత్ మౌత్ టాక్ తో కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. 


కొసమెరుపు: ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేయడానికి ఇదో మంచి ఆప్షన్.