Friday, December 31, 2010

తెలుగు ఫై మోజు పడిన గౌతం మీనన్

ఘర్షణ సినిమాతో తెలుగులో నేరుగా సినిమా తీసి తెలుగు ప్రజల అభిమానాన్ని
సంపాదించాడు. మళ్లీ "ఏ మాయ చేసావే" తో తెలుగు వారిని తన మాయలో
ముంచాడు. ఎప్పుడూ తమిళ సినిమాల ఫై ద్రుష్టి  పెట్టె గౌతం మీమన్ ఈసారి
తెలుగు ఫై కన్ను పడింది. "ఏమాయ చేసావే" ఇచ్చిన సక్సెస్ తో మళ్లీ డైరెక్ట్ గా
సినిమా తీసి హట్రిక్ కొట్టాలని అనుకుంటున్నాడు. ముచటగా మూడో సినమాని
రెడీ ఫేం రాం తో తన అదృష్టాన్ని పరీక్షించు కుంటున్నాడు .  ఇప్పటికే సున్నితమైన
లవ్ స్టోరి లతో యూత్ మనసు దోచిన గౌతం మళ్లీ తన మాయతో తెలుగు ప్రేక్షకులను
మెప్పిస్తాడో లేదో చూడాలి.

Thursday, December 30, 2010

టాలీవుడ్ కి మూడు అరిష్టాలు

ఏ ఏడాదీ లేనంతగా టాలీవుడ్ ఈ సంవత్సరం బోలెడు కష్టాలు ఎదుర్కొందు. అందులో మూడు ఇండస్ట్రీని మరీ దెబ్బతీశాయి. అవి... దీర్ఘకాల సమ్మె, డ్రగ్స్ భాగోతం, భారీఫ్లాపులు. మొదటిది ఆర్థికంగా దెబ్బకొడితే రెండోది పరువు తీసింది. మూడోది మాత్రం ఒకరకంగా నష్టమే చేసినా మరో రకంగా పరిశ్రమ వ్యక్తుల కళ్లు తెరిపించింది


దీర్ఘకాల సమ్మె... తెలుగు చలనచిత్ర చరిత్రలో ఇంత సుదీర్ఘకాల సమ్మె గతంలో ఎప్పుడూ జరగలేదు. కోటశ్రీనివాసరావు వంటి పెద్దలు వాపోతున్నా సరే, మనవాళ్లను కాదని డాన్సర్లనూ ఫైటర్లనూ యాక్టర్లనూ... ఇలా సమస్తక్రాఫ్టుల వాళ్లనూ తమిళనాడు నుంచి దిగుమతి చేసుకుంటున్న నిర్మాతలకు ఫైటర్లు తగిన బుద్ధే చెప్పారు. కానీ పరిస్థతి ముదిరి నిర్మాతలు షూటింగులు బంద్ చేస్తామనే దాకా వెళ్లింది. దీంతో షూటింగుల్లేక పాపం బడుగు కళాకారులు డొక్కలు ఎండిపోయాయి.

డ్రగ్స్ భాగోతం... సినిమా వాళ్లు తాగుతారనీ ‘తిరుగు’తారనీ అందరికీ తెలిసిన విషయమే. వాళ్లు మడికట్టుక్కూర్చోరన్న విషయమూ తెలిసిందే. పూర్వం అందుకే సినిమావాళ్లంటే చులకనగా చూసేవాళ్లు. డ్రగ్స్ భాగోతం కూడా ఎప్పటి నుంచోనే ఉన్నా ఇంత భారీస్థాయిలో బయటపడింది మాత్రం ఈ ఏడాదే. పేర్లు మినహా డ్రగ్స్ వాడే నటీనటుల గురించి సవివరంగా వార్తల్లో వచ్చేయడంతో సినిమావాళ్ల మీదుండే చులకన భావం మరింత పెరిగింది.


భారీఫ్లాపులు... పక్క రోబో, యముడు ఆఖరికి ఆవారా కూడా మనదగ్గర బాగానే ఆడేస్తే మన ‘అగ్ర’ హీరోల సినిమాలు మాత్రం భారీస్థాయిలో బాల్చీతన్నేశాయి. కేడీ, పులి, ఖలేజా, ఆరెంజ్.. చెప్పకొంటూ పోతే బోలెడు. కాకపోతే ఈ దెబ్బలకు ఇండస్ట్రీ పెద్దల దిమ్మతిరిగినట్టే కనిపిస్తోంది. ఖర్చు తగ్గించడం గురించి మాట్లాడటం మొదలెట్టారు ఇప్పుడిప్పుడే. మాటల వరకూ సరేగానీ అది ఆచరణలోకి కూడా వస్తే బాగుణ్ను.
అప్పుడు 2011లోనైనా నాలుగు మంచి సినిమాలు చూడొచ్చు!

Monday, December 27, 2010

పొరుగింటి పుల్లకూర రుచి..

ప్రఖ్యాత దర్శకులు కె. బాలచందర్కు  ఎఎన్నార్  అవార్డు -2011 


 2006 నుంచి ఏటా ఇస్తున్న ఎఎన్నార్  అవార్డును 2011 ఏడాదికి గాను ప్రఖ్యాత దర్శకులు కె. బాలచందర్ ఎంపికయ్యారు.
అత్యున్నత ప్రతిభావంతులను తగిన విదంగా సత్కరించే ఉద్దేశంతో తన పేరుతో ఓ అంతర్జాతీయ పురస్కారాన్ని ప్రకటించిన మహానటుడు, దాదా సాహెబ్ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు. 2006 నుంచి ప్రతి ఏడాది క్రమం తప్పకుండా పురస్కారం ఇస్తున్నారు. ఎంపికైన వాళ్ళందరూ అతిరథ మహారాధులే. 2006 లో    దేవానంద్, తర్వాత వరుసగా షబానా అజ్మి, అంజలీదేవి, వైజయంతి మాల, లతా మంగేష్కర్ ఈ అవార్డును అందుకున్నారు. 2011 ఏడాదికి సీనియర్ దర్శకుడు కె.బాలచందర్ కు అందించబోతున్నారు. జనవరి పదకొండో తేదిన ఈ వేడుక జరగనుంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారు.
కొసమెరుపు : ఏఎన్నార్ ఎంపికను తప్పు పట్టలేం కానీ, ఇక్కడ మన తెలుగునాట కూడా ఎందరెందరో గొప్ప దర్శకులున్నారు. ఓ బాపు, ఓ విశ్వనాధ్, ఓ దాసరి.. ఇలా తెలుగు సినిమా ఖ్యాతిని నలుదిక్కులా  చాటిన వారెందరో ! వారిని ఎందుకు పరిగణలోకి తెసుకోవడం లేదన్నది ఓ చిన్న అనుమానం. 
పిఎస్ : తమిళ హీరోల గురించి, తమిళ దర్శకుల గురించి మన మీడియా పుంఖాను పుంఖాలుగా అబినందిస్తూ రాస్తుంటుంది. అలాగే ఎన్నో పురస్కారాలు వాళ్ళకు కట్టబెడుతూ ఉంటుంది. కానీ, మన తెలుగు ప్రముఖుల్లో ఒక్కరికైన వాళ్ళు సత్కారం చేసింది లేదు. కనీసం అక్కడి మీడియా కూడా మనవారి గురించి ఒక్క అక్షరం ముక్క రాసింది లేదు. గతం గమనిస్తే ఎందులోనూ మనం అరవం వాళ్ళకి తెసిపోలేదు. కొండకొచో ముందంజలోనే ఉన్నాము.

తెలుగు జాతి మనది !
నిండుగా వెలుగు జాతి మనది!!  

Friday, December 24, 2010

లక్కు అంటే ఇది: లేటు వయసులో గ్రేటు ఛాన్సు

లక్కు అంటే ఇది: లేటు వయసులో గ్రేటు ఛాన్సు



లక్కు అంటే ఇది: లేటు వయసులో గ్రేటు ఛాన్సు 
nira radia, 2g spectrum, poonam jhawar, 2g Radia-tion

Wednesday, December 22, 2010

తెలుగు సినిమా: టాప్-10 డిజాస్టర్స్

డిసెంబర్ నెల చివరాఖరకు రాగానే ఆ ఏడాది మొత్తాన్ని సింహావలోకనం చేసుకోవడం ఏ రంగంలో ఉన్నవారికైనా సర్వసాధారణం. ముఖ్యంగా సినిమా ఫీల్డులో ఈ తరహ రౌండప్ లు అధికం. 2010 మాత్రం తెలుగు సినిమాకు కూసింత తీపిని, గంపెడంత చెడుని పంచిపెట్టింది. నందమూరి బాలకృష్ణ 'సింహ' ఒక్కటే ఈ ఏడాదికి అతిపెద్ద ఎస్సెట్. టాప్ టెన్ బ్లాక్ బస్టర్స్ గురించి ప్రస్తావించాల్సింది పోయి, టాప్ టెన్ డిజాస్టర్స్ ను   రాసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
2010 లో టాప్ టెన్ డిజాస్టర్స్ ఏమిటో మాకు తెలిసిన విశ్వసనీయ సమాచారం నిజాయితీగా ఇక్కడ పొందుపరుస్తున్నాం. సినీ  ప్రేక్షకులుగా మీరు మీ అబిప్రాయాలు స్వేచగా వ్యక్తం చేయవచ్చు.



తెలుగు సినిమా: టాప్-10 డిజాస్టర్స్
Top-10 disasters, Tollywood failures, Telugu cinema, big heros-big flops

Tuesday, December 21, 2010

ఇవి అప్పల్రాజు క్యారెక్టర్లు: ఒరిజినల్ గా ఎవరో కనిపెట్టండి!

సినిమా విడుదల అయ్యేవరకు డైరెక్టర్లకు కథ అంటే ప్రాణం తో సమానం. అదెక్కడ  లీకవుతుందో అని భయపడి  చస్తుంటారు. కానీ రాంగోపాల్ వర్మ ఇందులోనూ తన ప్రత్యేకతను చాటాడు. ఇప్పటికే కథ మొత్తం తనే లీక్ చేసేసాడు. ఇప్పుడు తాజాగా క్యారెక్టర్లను కూడా వివరాలతో సహా వెల్లడించేసాడు.  సినిమా ఫీల్డ్ లో కనిపించే కొందరు విచిత్రమైన వ్యక్తులపై వర్మ ఈ సినిమాలో మారు పేర్లతో సెటైర్లు వేస్తున్నాడు. సినిమా క్యారెక్టర్లను ఇక్కడ ఇస్తున్నాం. ఒరిజినల్ గా ఏ క్యారెక్టరు ఎవరిదో మీరు కనుక్కోండి.















appalraju, sunil, ramgopal varma,