Saturday, January 22, 2011

పాపం పవన్ కళ్యాణ్



పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ - ఇది నిర్మాతగా మారిన పవన్ కళ్యాణ్ స్థాపించిన సిని నిర్మాణ సంస్థ. పేరు మరోసారి చదవండి. ఎందుకంటే ఇపుడు దాని గురించే మనం మాట్లాడుకోవాలి.
'దబాంగ్' బాలీవుడ్లో 2010 ని రికార్డులతో షేక్ చేసిన సినిమా. సల్మాన్ ఖాన్ హీరో గా నటించిన ఆ సినిమాను పులి తో కుప్పకూలిన పవర్ స్టార్ తెలుగులో  చేయాలనుకున్నారు. అంతే కాదు దానిని తాను కొత్తగా నెలకొల్పిన సొంత సినీ నిర్మాణ సంస్థపైనే తీయాలని సంకల్పించారు. 'మిరపకాయ్' తీసిన హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఈ సినిమాను తెలుగు లో రీమేక్ చేయిస్తున్నారు. తనే హీరో.
అసలు విషయం ఏంటంటే 'క్రియేటివ్ వర్క్స్' అని పేరు పెట్టుకుని.. రీమేక్ మీద ఆధారపడటం. అదికూడా తొలి సినిమాకే ఇలాంటి  పొరపాటు చేయడం. ఇదేమి పెద్ద తప్పు కాకపోయినా సినీ జనాలు చెవులు కొరుక్కోవడానికి మాత్రం బాగా పనికొస్తోంది.

pavan kalyan, powerstar

1 comment:

  1. బాగుంది. భలే పాయింట్ పట్టుకున్నారు మీరు. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ గమనించాలి. ఈ సినిమా రీమేక్ చేద్దామని తీసుకున్న నిర్ణయం ఇటీవలే తీసుకున్నదనుకుంటా. ఆ బ్యానర్(నిర్మాణసంస్థ) పేరు మాత్రం చాలా రోజులనుంచి వార్తలలో వినబడుతోంది. సో, రీమేక్ చేద్దామని అనుకున్నతర్వాత పెట్టిన బ్యానర్ కాదు ఇది.

    అయితే మీరు లేవదీసిన పాయింట్ కూడా కరెక్టే. నిర్మాణసంస్థ పేరు వేరేది పెట్టుకుని ఈ సినిమా నిర్మాణం చేపట్టాల్సింది. అతనికి ఈ పాయింట్ తట్టి ఉండదేమో. ఎవరైనా చెబితే బాగుండు.

    ReplyDelete