మగధీరతో శిఖర సమాన విజయాన్ని అందుకున్న రామ్ చరణ్ ఇప్పుడు అయోమయం లో పడ్డాడు. ఆరంజ్ దెబ్బకు ప్రస్తుతం ప్రయోగం చేసే పరిస్థితి లేదు. పాట చింతకాయ అన్న పర్లేదు కానీ అర్జెంటు ఓ కమర్షియల్ హిట్ కావాలి మనవాడికి. లేకపోతే అన్ని రకాలుగా ఇబ్బందులు తప్పవు. కొంతకాలం క్రితం అంటే ఆరంజ్ కు ముందు గమ్యం క్రిష్.. చరణ్ కు ఓ కథ చెప్పాడు. అయితే అప్పుడు దానిని చరణ్ వాయిదా వేశాడు. ఆరంజ్ అడ్రెస్ లేకుండా పోయాక మళ్లీ క్రిష్ ను పిలిచి ఓకే చేశాడు. అసలు అయోమయమే ఇక్కడ మొదలైంది. క్రిష్ టాలెంట్ పైన నమ్మకం ఉన్నా అతడివి డైరెక్టర్ సినిమాలే కానీ హీరోయిక్ సినిమాలు కావు. ఈ నేపథ్యంలో చరణ్ అయోమయం లో పడ్డాడు. పోనీ లే హీరోయిజం లేకపోయినా తనలో కొత్త కోణం బయటకు వస్తుంది ఈ సినిమాతో అని సర్ది చెప్పుకుంటున్నాడట . క్రిష్ మాత్రం భయపడకు నే ఇమేజ్ డ్యామేజ్ కాకుండా చూస్తానని మాట ఇచాడట.
ఇంతకూ ఆ సినిమా టైటిల్ ఏంటో తెలుసా : 'ఆ' (ఇంకా అనుకుంటున్నారు)
ramcharan, krish

veedu hero avvadamey pedda goppa...
ReplyDeletehttp://telugutelevisionmedia.blogspot.com/