Monday, December 27, 2010

పొరుగింటి పుల్లకూర రుచి..

ప్రఖ్యాత దర్శకులు కె. బాలచందర్కు  ఎఎన్నార్  అవార్డు -2011 


 2006 నుంచి ఏటా ఇస్తున్న ఎఎన్నార్  అవార్డును 2011 ఏడాదికి గాను ప్రఖ్యాత దర్శకులు కె. బాలచందర్ ఎంపికయ్యారు.
అత్యున్నత ప్రతిభావంతులను తగిన విదంగా సత్కరించే ఉద్దేశంతో తన పేరుతో ఓ అంతర్జాతీయ పురస్కారాన్ని ప్రకటించిన మహానటుడు, దాదా సాహెబ్ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు. 2006 నుంచి ప్రతి ఏడాది క్రమం తప్పకుండా పురస్కారం ఇస్తున్నారు. ఎంపికైన వాళ్ళందరూ అతిరథ మహారాధులే. 2006 లో    దేవానంద్, తర్వాత వరుసగా షబానా అజ్మి, అంజలీదేవి, వైజయంతి మాల, లతా మంగేష్కర్ ఈ అవార్డును అందుకున్నారు. 2011 ఏడాదికి సీనియర్ దర్శకుడు కె.బాలచందర్ కు అందించబోతున్నారు. జనవరి పదకొండో తేదిన ఈ వేడుక జరగనుంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారు.
కొసమెరుపు : ఏఎన్నార్ ఎంపికను తప్పు పట్టలేం కానీ, ఇక్కడ మన తెలుగునాట కూడా ఎందరెందరో గొప్ప దర్శకులున్నారు. ఓ బాపు, ఓ విశ్వనాధ్, ఓ దాసరి.. ఇలా తెలుగు సినిమా ఖ్యాతిని నలుదిక్కులా  చాటిన వారెందరో ! వారిని ఎందుకు పరిగణలోకి తెసుకోవడం లేదన్నది ఓ చిన్న అనుమానం. 
పిఎస్ : తమిళ హీరోల గురించి, తమిళ దర్శకుల గురించి మన మీడియా పుంఖాను పుంఖాలుగా అబినందిస్తూ రాస్తుంటుంది. అలాగే ఎన్నో పురస్కారాలు వాళ్ళకు కట్టబెడుతూ ఉంటుంది. కానీ, మన తెలుగు ప్రముఖుల్లో ఒక్కరికైన వాళ్ళు సత్కారం చేసింది లేదు. కనీసం అక్కడి మీడియా కూడా మనవారి గురించి ఒక్క అక్షరం ముక్క రాసింది లేదు. గతం గమనిస్తే ఎందులోనూ మనం అరవం వాళ్ళకి తెసిపోలేదు. కొండకొచో ముందంజలోనే ఉన్నాము.

తెలుగు జాతి మనది !
నిండుగా వెలుగు జాతి మనది!!  

No comments:

Post a Comment