Saturday, December 11, 2010

ఇండియాకు రజనీకాంత్ గిఫ్టు

రోబోలాంటి సినిమాతో భారతీయ చలనచిత్రరంగానికి మెగా హిట్ నిచ్చిన రజనీకాంత్ పుట్టినరోజు... డిసెంబర్ 12.
1949లో పుట్టిన రజనీకిది షష్ఠిపూర్తి సంవత్సరం. 1975లో అపూర్వరాగంగళ్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి ఇంతింతై వటుడింతై... అన్నట్టు ఇప్పుడు రోబో సినిమాతో నిజంగానే ‘బ్రహ్మాండాంత సంవర్థి’ అనిపించుకున్నాడు. ఇండస్ట్రీలో ముప్ఫైఐదేళ్ల సీనియారిటీ ఉన్నప్పటికీ నేటికీ అణకువగా ఉండే(ఇక్కడ మన హీరోల్ని పొరపాటున కూడా గుర్తు తెచ్చుకోకండేం!) మన శివాజీరావ్ గైక్వాడ్ అలియాస్ సూపర్ స్టార్ రజనీకాంత్ ముందు ముందు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ....
HAPPY BIRTH DAY RAJINI KANTH

3 comments:

  1. "....భారతీయ చలనచిత్రరంగానికి మెగా హిట్ నిచ్చిన...."

    మెగా హిట్‌లన్ని కూడ మంచి సినిమాలేనా!!!!!!!!!

    మంచి సినిమాని మెగా హిట్ చెయ్యగల అభిరుచి (అదేలెండి "టేస్ట్" అని కొన్ని దశాబ్దాల క్రితం చాలామందికి ఉండేదిట) ఇప్పటి ప్రేక్షకులకి లేదు.

    ReplyDelete
  2. శివ గారూ .. ఇది వేదిక కాకపోయినా నేను వాదన చెయ్య దల్చుకున్నాను. ఈనాటి ప్రేక్షకులంటే ఎవరు మన పిల్లలేగా వాళు పెరిగింది మన పెంపకం లోనెగా .. మన అభిరుచులు మన అభిమతాలేగా వాళ్లకి అబ్బేవి
    చిన్నప్పుడు మన ముద్దు కోసం కార్టూన్ ఛానల్స్ , ప్లే స్టేషన్లు అలవాటు చేసి పెద్దయ్యాక వాళ్ల TASTE మారమంటే ఎలా మారుతుంది ? ఆయినా మీ తండ్రిగారి TASTE కీ మీ TASTE కి తేడాలేదా?
    మీ వేష భాషలూ అయన వేషభాషలు అస్సలు తేడా లేవా? మార్పు సహజం, కాకపోతే కాస్త??మంచి?? మార్పు?? కోరుకోవాలి.
    ఉన్నది ఉన్నట్టుగానే ఉంటె దాన్ని జడత్వం అంటారు
    క్షమించండి ఇది వాదన కోసం కాదు (బ్లాగ్ యజమానికి కూడా క్షమాపణలు ధన్యవాదములు చోటిచ్చినందుకు)

    ReplyDelete
  3. siva gariki:

    blagu ku vachinanduku Danyawaadalu, trendy manasthatwanni batti cinemalu vastayi sivagaru manam em cheyagalam cheppandi

    aatreyagariki:

    lokam gurinchi, marpu gurinchi chala chakkaga chepparu. I support your aatreyagaru, thank you

    ReplyDelete