Sunday, March 13, 2011

మణిరత్నం,మహేష్ ల చిత్రం కాన్సెప్ట్ ఇదే.....

కల్కి నవల ముఖ చిత్రం
ప్రకటన దశ లోనే విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకొన్న మణిరత్నం,మహేష్ బాబు ల చిత్రానికి సంబంధించి కొన్ని వివరాలు బయటికి వచ్చాయి. ఇది ప్రదానంగా చారిత్రాత్మక మైన సబ్జెక్టు అని ప్రచారం జరుగుతోంది. ప్రముఖ తమిళ రచయిత పోన్నియన్ రాసిన చారిత్రాత్మక,క్లాస్సిక్ నవల 'కల్కి' ని మణిరత్నం సినిమాగా మలుస్తోనట్టు తెలుస్తోంది. అనేకమంది తమిళ సాహితీ వేత్తల సలహాలు తీసుకొని మణిరత్నం ఈ చిత్ర స్క్రిప్ట్ ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం కమలహాసన్ కుడా కొన్ని సూచనలు చేశారట. ఈ చిత్రం లో యుద్ధ సన్నివేశాలు చిత్రించడానికి ఫ్రెంచ్ నుంచి మేలుజాతి గుర్రాలను తెప్పిస్తున్నారట. ఇది వరకే తన చిత్రం కోసం ఎలాంటి అనుభవాలున్న కమల్ వీరికి విలువైన సూచనలు ఇస్తున్నారట. 20  శతాబ్దానికి చెందినా కథాశం తో రాబో తున్న ఈ చిత్రం లో తమిళ నటులు విజయ్,ఆర్యాలు కుడా నటిస్తున్నారు..........

Monday, March 7, 2011

ఔను వాళ్ళిద్దరూ స్నేహం లో పడ్డారు......

ఒకప్పుడు వారిద్దరిమధ్య పచ్చ గడ్డి వేస్తె భగ్గుమనేది. ఒకరంటే ఒకరికి మంట. ఎదుటి హీరో గురించి తమ సినిమా లో డయిలాగులు    రాయించుకొని మరీ తిట్టుకోనేవారు . సినిమాలు చేయటం లో కూడా  వీరి మద్య విపరీతమైన పోటి. వారే తమిలహీరోలు విజయ్,అజితకుమార్ లు దాదాపు ఒకే సారి కెరీర్ ప్రారంభించిన వీళ్ళిద్దరికీ అసలు పడేది కాదు. అనేక సినిమాల్లో వీరు ఒకరి గురించి ఒకరు ఇన్ డైరెక్ట్ గా తిట్టుకొని తమ కసిని తీర్చుకొన్నారు . అయితే ఇదంతా గతం ప్రస్తుతం వీరిద్దరూ స్నేహితులుగా మారారు. అలగిలాగా కాదు వీరి స్నేహం ఇండేప్త్ గా మారింది. ఈ మద్య అన్ని ఫంక్షన్ లలోను వీరు పక్కపక్కనే కుర్చుని నవ్వుకొంటూ కనిపిస్తున్నారు . అంతే కాదు వీరిద్దరూ కలిసి నటించడానికి కుడా సై అన్నారట వీరి కోసం దర్శకుడు వెంకట్ ప్రభు కథను సిద్ధం చేస్తున్నాడట.బద్ద శత్రువు లు గా ఉన్న వీరు ఇంత క్లోజ్ ఎలా అయ్యారబ్బా అని ముక్కున వేలేసుకొంటున్నారు  సినీ జనాలు....

Sunday, March 6, 2011

తన సినిమా ఎత్తేస్తున్నారని ఆత్మ హత్య యత్నం చేసిన యువ హీరో


 థియేటర్ నుంచి తన సినిమా తొలగిస్తున్నారని,నిజంగా తన సినిమా ను ఎత్తేస్తే ఆత్మహత్య చేసుకొంటానని అదే థియేటర్ పైకి ఎక్కడో యువ హీరో. థియేటర్ పైకి ఎక్కి చాకు పట్టుకొని గొంతుకోసుకొంటానని బెదిరించాడు. దీంతో ఉల్లికిపడ్డ పోలీసులు ఫైర్  సిబ్బంది అతన్ని బతిమాలి కిందికి తీసుకొచ్చారు. బెంగళూరు లో ఓ థియేటర్ వద్ద ఈ సంఘటన జరిగింది.  ఆ యువ  కన్నడ హీరో పేరు హరీష్.  హరీష్  స్వయంగా దర్శకత్వం వహించి నటించిన గన్ అనే సినిమా  గత శుక్రవారం విడుదల అయ్యింది. సినిమా ఫ్లాఫ్ టాక్ తెచ్చుకొంది. ఇదిలా ఉండగా వచ్చే గురువారం మరో హీరో సుదీప్ నటించిన ఓ సినిమా రిలీజ్ కానుంది. దీంతో హరీష్ సినిమాను ఎత్తేస్తున్నామని థియేటర్ యాజమాన్యం అతడికి చెప్పారు. దీనిపై అతడు వారితో గొడవకు దిగాడు. కల్లెక్షన్లు లేక పోతే సినిమాను ఎలా ఆడిస్తామని థియేటర్ వారు ప్రశ్నించారు. దీంతో హరీష్ థియేటర్ పైకి ఎక్కి కలకలం సృష్టించాడు. చిత్ర రంగ ప్రముఖులు, మీడియా తనకు సహకరించటం లేదని,థియేటర్ యాజమాన్యం సినిమా రెండు వారాలు కూడా ఆడదంటు తన స్థైర్యాన్ని దెబ్బ తీస్తూందని హారీష్ విరుచుకుపడ్డాడు. కోట్ల రూపాయలతో సినిమా తీసిన తన గతి ఏం కావాలని ప్రశ్నించాడు. తానూ బతికి ప్రయోజనం లేదన్న హరీష్ ను పోలీసులు బలవంతంగా కిందికి దించారు. ఇంకా కొసమెరుపేంటంటే హరీష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్య యత్నానికి కాదు. హరీష్ ను దించుతున్నప్పుడు  అతన్ని చేతిలోని చాకు ఓ పోలీసు కు తెగి గాయం అయ్యింది. అందుకు.....

Tuesday, March 1, 2011

ఎమ్,ఎమ్ ల కాంబినే షన్ అయ్యేనా సెన్సేషన్.....


తాను మణిరత్నం తో కలిసి పని చేయనున్నట్లు ప్రిన్స్ మహేష్ బాబు ట్వి టర్   లో  వెల్లడించాడు. దీంతో తన జీవిత లో ఒక కోరిక నేరవేరిన్నట్టేనని మహేష్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఆప్పుడీ ఈ చిత్రం పై అంచనాలు మొదలయ్యాయి. ఇది తెలుగు,తమిళ,హిందీ భాషల్లో రాబోతున్న త్రి భాష చిత్రమని తెలు చానెళ్ళు ప్రకటిస్తున్నాయి. ఇవ్వన్నీ ఎంతవరకు నిజమోగాని ప్రస్తుతానికి అటు మణి రత్నం కు మహీష్ బాబుకు హిట్ అత్యవసరం అని గుర్తించాలి. మణి కెరీర్ లో హిట్ లేక ఏళ్ళు గడిచిపోయాయి. ఏదో పాత వాసనలతో మణి రత్నం బండి నడుపుకోస్తున్నాడు. ఈమధ్యనే మణి రత్నం తో చిత్రానికి నిర్మాతలు ఎవరు ముందుకు రాలేదనే వార్తలు కూడా వచ్చాయి. అయితే మని,మహేష్ ల చిత్రం తెలుగులో మంచి క్రేజ్ ను సంపాదిస్తుంది అనేది వాస్తవం. మరి మహేష్ ను  మణిరత్నం ఎలా చేపెడుతున్నాడు. ఈ చిత్రం ఎలా ఉండబోతోంది. సందేశాన్ని ఇచ్చే ప్రేమకథ లైన రోజా,బొంబాయి లాగా ఉంటుందా...లేక గీతాంజలి వంటి ప్రేమకథ....సఖి వంటి రొమాంటిక్ లవ్ స్టోరీ నా.....అమృత వంటి డిఫరెంట్ సుబ్జేక్టా....గురు,ఇద్దరు వంటి రియలి స్టిక్ అప్రోచ్చా ....ఏమో లేట్ వైట్ అండ్ సి.......

Sunday, February 27, 2011

నాగార్జునకు అవార్డ్ తో ఎవరికి లాభం.....


మొత్తానికి నాగార్జున లలిత కళా రత్న అయ్యాడు. ( దీనికి అర్థమేంటబ్బ... ఏమన్నా లలిత కళల కు సంబంధించినదా...). దీనికి అర్థం బిరుదు ను గ్రహించిన వ్యక్తికి,బిరుదును ప్రధానం చేసిన వ్యక్తికి తెలీకపోయినా(అవార్డు ప్రదాన ఫంక్షన్ లో వారు దీనికి అర్థం చెప్పలేదు మరి ) బిరుదు ఇచ్చిన వ్యక్తి కళాబందు  కాబట్టి దీనికి విలువ నివ్వాలిసిందే. అయినా నాగ్ కు ఇంత అర్జెంటు గా అవార్డ్ నివాల్సిన అవసరం ఏ మొచ్చింది.( చిన్న వయసే కదా ). పైగా కారణం ఏం చెప్పలేదు. అయినా సుబ్బరామి రెడ్డి గురించి తెలిసిన వారెవరైనా ఈ అవార్డ్ ను లైట్ గా  తీసుకొంటారు. ఎందుకంటె ఈ కళాబందు అవార్డ్ లు ఇవ్వంది , సన్మానాలు చెయ్యంది ఎవరికి చెప్పండి. సన్మానాలు, పార్టీ ల విషయంలో డిల్లి స్థాయిలో ప్రసిద్ధి ఈ నెల్లూరు రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ కు వెళ్ళే శ్రీమాన్ సుబ్బరామి రెడ్డి గారికి చిత్ర సీమతో చాలా దగ్గరి సంభందాలున్నాయి. గత 30  ఏళ్ళుగా తరచూ పార్టీ లతో సన్మానాలతో పరిశ్రమలోని అన్ని వర్గాలతో ఆయన సంపాదించుకొన్న సాన్నిహిత్యం అది. తెలుగు సినిమాకు సంబంధించి ఎవరికి పద్మ పురస్కారాలు వచ్చినా అందులో సుబ్బరామి రెడ్డి గారి ప్రమేయం ఉందనే మాట వినిపిస్తూ ఉంటుంది. మరి ఆయన మంచి లాబీయిస్టు మరి. వారిని కాంగ్రెస్ కు దగ్గరచేస్తానని అధిష్టానానికి చెప్పుకొని తన రాజ్యసభ సభ్యత్వాని పోదిగించుకోవటం రివాజు. చాలా కాలం నుంచి ఫంక్షన్ అరీన్జ్ చేయని కరువును దీంతో తీర్చుకొన్నాడు సుబ్బరామి రెడ్డి. కాని నాగార్జునకు అవార్డ్ ఏంటి అనే సందేహానికి అవకాశం ఇచ్చాడు ఆయన. దీనికి బదులు ఆ అవార్డ్ ఏదో అక్కినేని నాగేశ్వరరావు కు ఇచ్చి ఉంటె సరిపోయేది కదా. అవార్డ్ యివ్వటానికి,తీసుకోవటానికి అడ్డేముంది......

Saturday, February 26, 2011

రజని కాంత్ తో నీళ్ళు తాగించిన రామ్ గోపాల్ వర్మ..........


టీవీ 9 రజినీకాంత్ అవతలి వాళ్ళను ఇరుకున పెట్టె ప్రశ్నలు అడిగి వారి వైపు విషపు నవ్వు చిందించటం ఇతని అలవాటు...తన ప్రశ్నలతో వారిని హింస పెట్టడం కుడా రజిని కాంత్ నైజం. అయితే తొలిసారి రజిని కాంత్ తను ఇంటర్వ్యూ చేసే వ్యక్తి చేతిలో చావుదెబ్బ తిన్నాడు. అతిధి గా వచిన్న ఆ వ్యక్తి మాటలతో రజని కాంత్ నీళ్ళునమిలాడు. రజినీకాంత్ పొగరును అనిచిన ఆ అతిధే రాంగోపాల్ వర్మ. టీవీ 9  వాళ్ళు వర్మ గురించి రామ్ ధమాల్ వర్మ పేరుతో వర్మ ఫై తీవ్రస్థాయిలో సెటైర్ లు వేశారు. దానిపై వర్మ కమిషనర్ ఏ కే ఖాన్ కు పిర్యాదు చేశాడు. అంతటితో వదిలేయాల్సిన అ విషయాన్ని టీవీ 9 మళ్లీ కెలికింది. వర్మను ఛానల్ కు పిలిపించి  మళ్లీ    చర్చ పెట్టింది. ఈ సారి గత ప్రోగ్రామ్లో పాల్గొన్న విశ్లేషకులనే పిలిపించి తాము చేసింది కరెక్ట్ అని నిరూపించుకోవాలని రజినీకాంత్ ప్రయత్నించాడు. అందరిమీద లాగే వర్మ మీద కూడా డ్యామినేషన్ చేయాలని  చూసిన రజిని ప్రయత్నాలకు వర్మ మంచి సమాధానాలే ఇచ్చాడు. ప్రతి ప్రశ్నకు బుల్లెట్ లాంటి సమాధానాలు ఎటుతిరిగీ తమ ప్రోగ్రాం ను కరెక్ట్ అని కవర్ చేసుకోవాలన్న రజని ప్రయత్నాలు ఫలించలేదు. అసలు తన ఆలోచనలు తప్పు అని చీప్పడానికి టీవీ 9  ఎవరని వర్మ సూటిగా  ప్రశ్నిన్చా డు . తానవి నెగిటివ్  ఆలోచనలు అనే నైతిక హక్కు టీవీ 9 కు లేదని ఉదయం లేస్తూనే టీవీ 9 చేసే పనేంటని సూటిగా ప్రశ్నించాడు. పెద్ద మానసిక వైధ్యుడినని  చెప్పుకొనే యండమూరి వీరేంద్రనాథ్ కు గాలి తీసి పంపించాడు వర్మ. ఆఖరికి తనని తాను రక్షించు కొనే పనిలో పడిపోయాడు రజినీకాంత్. అందరిని తన మాటలతో ఆడుకొనే రజని కాంత్, వర్మ ముందు తేలిపోయాడు. అందుకే వర్మ లాంటి దారి తప్పిన మేధావులతో బీ కేర్ ఫుల్....

Thursday, February 24, 2011

''వారు నన్ను అవసరాలకు వాడు కొన్నారం''టున్న హీరొయిన్

తరచూ వివాదాస్పద ప్రకటనలతో వార్తల్లో ఉండే నటి లక్ష్మి రాయ్ ఇప్పుడు మరో సంచలన ప్రకటన చేశారు. చిత్ర సీమలోని కొందరు వ్యక్తులు తనను తమ అవసరాలకు వాడుకొన్నారని ఈమె అంటోంది. ఈ మాటలు ఇప్పుడు చర్చనీయా  అంశాలు గా మారాయి. ఆవ్యక్తుల పేర్లు తను వెల్లడిన్ చలేనని కుడా ఈ భామ పేర్కొంది. తోటి నటులతో చెట్టపట్టాలు వేసుకు తిరుగుతుంది అని కూడా ఈమేకు పేరుంది. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ధోని తో ప్రేమాయణం సాగించిన లక్ష్మి రాయ్ ఆ తరువాత తాము స్నేహితులం మాత్రమేనని, అంతకు మించి తమ మధ్య ఏ లాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చింది. మళ్లి  ఇప్పుడు ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు అన్నదో తెలియక చిత్రపరిశ్రమ పెద్దలు తలలు పట్టుకోన్ టున్నారు. మరో వైపు లక్ష్మి రేయ్ ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ ను పోగడ్తల  తో ముంచేస్తోంది. కాని ఈమె ఒక విషయం గుర్తుంచుకోవాలి సచిన్ ధోని లాంటి వాడు కాదు..........