Sunday, February 27, 2011

నాగార్జునకు అవార్డ్ తో ఎవరికి లాభం.....


మొత్తానికి నాగార్జున లలిత కళా రత్న అయ్యాడు. ( దీనికి అర్థమేంటబ్బ... ఏమన్నా లలిత కళల కు సంబంధించినదా...). దీనికి అర్థం బిరుదు ను గ్రహించిన వ్యక్తికి,బిరుదును ప్రధానం చేసిన వ్యక్తికి తెలీకపోయినా(అవార్డు ప్రదాన ఫంక్షన్ లో వారు దీనికి అర్థం చెప్పలేదు మరి ) బిరుదు ఇచ్చిన వ్యక్తి కళాబందు  కాబట్టి దీనికి విలువ నివ్వాలిసిందే. అయినా నాగ్ కు ఇంత అర్జెంటు గా అవార్డ్ నివాల్సిన అవసరం ఏ మొచ్చింది.( చిన్న వయసే కదా ). పైగా కారణం ఏం చెప్పలేదు. అయినా సుబ్బరామి రెడ్డి గురించి తెలిసిన వారెవరైనా ఈ అవార్డ్ ను లైట్ గా  తీసుకొంటారు. ఎందుకంటె ఈ కళాబందు అవార్డ్ లు ఇవ్వంది , సన్మానాలు చెయ్యంది ఎవరికి చెప్పండి. సన్మానాలు, పార్టీ ల విషయంలో డిల్లి స్థాయిలో ప్రసిద్ధి ఈ నెల్లూరు రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ కు వెళ్ళే శ్రీమాన్ సుబ్బరామి రెడ్డి గారికి చిత్ర సీమతో చాలా దగ్గరి సంభందాలున్నాయి. గత 30  ఏళ్ళుగా తరచూ పార్టీ లతో సన్మానాలతో పరిశ్రమలోని అన్ని వర్గాలతో ఆయన సంపాదించుకొన్న సాన్నిహిత్యం అది. తెలుగు సినిమాకు సంబంధించి ఎవరికి పద్మ పురస్కారాలు వచ్చినా అందులో సుబ్బరామి రెడ్డి గారి ప్రమేయం ఉందనే మాట వినిపిస్తూ ఉంటుంది. మరి ఆయన మంచి లాబీయిస్టు మరి. వారిని కాంగ్రెస్ కు దగ్గరచేస్తానని అధిష్టానానికి చెప్పుకొని తన రాజ్యసభ సభ్యత్వాని పోదిగించుకోవటం రివాజు. చాలా కాలం నుంచి ఫంక్షన్ అరీన్జ్ చేయని కరువును దీంతో తీర్చుకొన్నాడు సుబ్బరామి రెడ్డి. కాని నాగార్జునకు అవార్డ్ ఏంటి అనే సందేహానికి అవకాశం ఇచ్చాడు ఆయన. దీనికి బదులు ఆ అవార్డ్ ఏదో అక్కినేని నాగేశ్వరరావు కు ఇచ్చి ఉంటె సరిపోయేది కదా. అవార్డ్ యివ్వటానికి,తీసుకోవటానికి అడ్డేముంది......

No comments:

Post a Comment