Friday, February 11, 2011

మన హీరోల చూపు కోలివుడ్ వైపు...

మన హీరో లకు జ్ఞానోదయం అయ్యింది. ఇన్ని రోజులు తెలుగుకే పరిమితం అయిన మన హీరోల చిత్రాలు ఇక నుంచి తమిళం లో కూడా మార్కెట్ చేయనున్నాయి. తాజాగా తెలుగు హీరో జూనియర్ NTR  తమిళ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన తాత,దివంగత నటుడు  రామారావు ప్రారంభం లో కొన్ని తమిళ చిత్రాల్లో నటించారు. ఆతరువాత ఆయన తెలుగు తెరకే పరిమితం అయ్యారు. కాని నాగార్జున వంటి కొంతమంది హీరోలు తమిళ ప్రేక్షకులను పలకరించి వచ్చారు. నాగార్జున 'శివ' తమిళంలో 'ఇదయం తిరుదాడే'పేరుతొ విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకొంది. 'గీతాంజలి' కూడా తమిళ్లోకి అనువాదమైంది. చాలా రోజుల తర్వాత నాగార్జున తమిళ్లో నటించిన 'రాక్షగాన్' ఫెయిల్ అవ్వటంతో మళ్ళి తమిళ్ జోలికి వెళ్ళలేదు. కాని ఆయన చిత్రాలు మాత్రం తమిల్లోకి  అనువాదం అయ్యేవి. ఈ మధ్యకాలంలో  మహేశ్ బాబు   'అతడు' తమిళ్లో మంచి హిట్ కొట్టింది. ఇప్పుడు మళ్లీ నాగార్జున 'గగనం' చిత్రం 'పయనం' పేరుతో విడుదల అవుతుంటే. తారక్ నటిస్తున్న 'శక్తి' తెలుగు,తమిళం భాషల్లో ఒకే సారి విడుదల అవ్వటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా లో ఇలియానా హీరోయిన్. తమిళ హీరోలు అనువాద చిత్రాలతో తెలుగు తెరపైకి దండెత్తుతుంటే కనీసం మన వాళ్ళు ఇప్పటికైనా మేల్కోవటం సంతోషమే కదా!

No comments:

Post a Comment