సినిమా పరిశ్రమలో రచయితలకు.దర్శకులకు, ఘోస్ట్ రైటర్ లు ఉంటారు అనే మాట విన్నాం. వాళ్ళు రాసిపెడితే వీళ్ళు తమ పేరును వేసుకొంటారు అని చాలామంది దర్షకుల విషయం లో పుకార్లు ఉన్నాయ్. మరి నిర్మాత లకు కూడా ఘోస్ట్ ప్రోడుసార్లు అదేనండి తాము డబ్బు పెట్టి వేరేవారి పేర్లు వేయించే వాళ్ళు ఉంటారా? అంటే అవుననే అంటున్నాయ్ టాలివుడ్ వర్గాలు. గణేష్ (ఈ మద్యనే ఈయన పేరు లోకి బాబు వచ్చి చేరింది లెండి )చాలా కలం నుంచి కామెడీ యాక్టర్ గా పరిచితుడే. రెండేళ్ళ క్రితం రవితేజ తో తీసిన ఆంజనేయులు తో నిర్మాత గా మారాడు గణేష్. అప్పు అందరు షాక్ అయ్యారు. గణేష్ కి అంత డబ్బు ఎక్కడిది! అను కొన్నారు. ఆ తరువాత మరిన్ని షాక్ లు ఇచ్చాడు గణేష్. పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో తో సినిమా మొదలేట్టెశాడు. అప్పుడే ఒక వార్తా బయలుదేరింది. గణేష్ ఏ రియల్ ఎస్టేట్ తో డబ్బు సంపాదిం చలేదని ఓ రాజకీయ నాయకుడు గణేష్ పేరు మీదుగా సినిమా లకు పెట్టుబడి పెడు తున్నడనే వార్తలు వినిపించాయి. అతడు ఎవరన్నది బహిరంగ రహస్యమే. గణేష్ సామాజిక వర్గానికే చెందినా ఆ మంత్రి ఈ పెట్టుబడులు పెడు తున్నదనేది వాస్తవమో కాదో తెలియదు కాని తీన్ మార్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి కూడా ఆ మంత్రి వర్యులు సతీ సమేతంగా విచ్చేయటం మాత్రం వాస్తవమే.....
Tuesday, March 22, 2011
Sunday, March 20, 2011
'రెడ్డి గారు పోయారంటున్న' రామ్ గోపాల్ వర్మ....
రామ్ గోపాల్ వర్మ మరో తను చేయబోయే మరో సంచలనాన్ని ప్రకటించారు. ఈ సారి తన అస్త్రం ఆంద్ర రాష్ట్ర రాజకీయాలపై ఎక్కుపెట్టాడు. రాయలసీమ ఫ్యాక్షనిజం పై సినిమా తర్వాతా కనీసం పాటల తో నైనా సినీ జనాల పై సెటైర్ వేసాడు అప్పలరాజు తో. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్తితు నేపథ్యంతో ''రెడ్డి గారు పోయారు''సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేసారు వర్మ. కనీస సెన్స్ ను ఉపయోగించి ఆలోచించినా అది వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తరువాత మలుపులు తిరుగుతోన్న రాష్ట్ర రాజకీయాల పై సెటైర్ అని చెప్పేయొచ్చు. ఎదేమైనా ఈ చిత్రం తీవ్రస్థాయిలో దుమారం రేపుతుంది అనటం లో ఎటు వంటి ఆశ్చర్యం లేదు. ఈ చిత్రం లో చిరంజీవి పాత్ర ఏంటి అనేదాని పై అప్పుడే ఊ హాగానాలు మొదలయ్యాయి. ఇది వరకే కాంగ్రెస్ చిరు పోత్తు లో చిరు హీరో కాదు హీరొయిన్ వంటివాడని వ్యాఖ్యానించిన వర్మ ఇప్పు ఏ నాయకుడిని ఎలా చుపుతాడనే ఆసక్తి నెలకొంది.....
Friday, March 18, 2011
అయ్యారే...నిత్యానంద పై మరో సినిమా....
రంజిత తో రక్తిని సీన్లతో దొరికిపోయిన నిత్యానంద స్వామి సినిమా వాళ్లకి హాట్ టాపిక్ అయ్యాడు. ఇప్పటికే పలు సినిమాల్లో కామెడీ బాబా లను మనం చూస్తుండగా, తెలుగులో నిత్యానంద రాసలీలను నటకిరీటి ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా విషయంలో నిత్యనంద తన పరువు పోతోందంటూ కోర్ట్‌కి కూడా ఎక్కాడు. ఇదిలా ఉంటే నిత్యానంద స్వామి లీలలను తెరకెక్కించే పనిపడ్డాడు ఓ కన్నడ నిర్మాత ఈ సినిమాకి ''సత్యానంద'' అని టైటిల్ పెట్టారు. ఈ సిన్మా విషయంలో నిత్యానంద గురూజీ కోర్ట్ కి ఎక్కే అవకాశం లేదంటున్నాడు ఈ నిర్మాత. తను ఇప్పటికే 14 మంది న్యాయవాదులను సంప్రదించానని ఎటు వంటి చట్ట పరమైన చర్యలకైనా సిద్ధం అని ఈయన అంటున్నాడు. ఇంకో విశేషం ఏంటంటే ఈ నిర్మాత బీజేపీ పార్టీ కి చెందినా వ్యక్తి. ఇప్పటికే ఈ ''సత్యానంద'' స్టిల్స్ శాడిల్ వుడ్ ని ఊపెస్తున్నాయి. మరి రంజిత పాత్ర ఏస్థాయిలో ఉంటుందో తెలియాల్సి ఉంది. చూద్దాం ఈ సత్యానంద లీలలు ఏ స్థాయిలో ఉంటాయో....
అందాల భామల కోల్డ్ వార్....
వారిద్దరూ అందాల భామలే.హీరొయిన్ లుగా మంచి పేరు తెచుకోన్నవారే. అయితే ఒకరంటే ఒకరికి పడదు. ఒకరి అవకాశాలను మరొకరు చేజిక్కిన్చుకోనేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలా వారిద్దరి మద్య చాలాకాలం నుంచి కోల్డ్ వార్ జరుగుతోంది. వారే కేరళ కుట్టి అసిన్,తమిళ ముద్దు గుమ్మ త్రిష టాలివుడ్ ,కోలివుడ్ ల మీదుగా బాలివుడ్ లోకి ప్రవేశించిన వీరి మద్య పోటి తీవ్ర స్థాయి లో ఉంది. సినిమా ల విషయం లోనే కాదు యాడ్స్ విషయం లో కూడా వీరు పోటి పడుతున్నారు. అసిన్ చాలా కాలంగా మోడల్ గా వ్యవహరిస్తున్న ఓ సౌందర్య సాధన ప్రకటనను త్రిష కొట్టేసారట ఈ యాడ్ కు సంభందించి గత వారం షూటింగ్ జరిగింది. దీంతో వీరిద్దరి మద్య శత్రుత్వం మరింత పెరిగిందని సమాచారం. రజిని కాంత్ సరసన రాణా లో నటించే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారి పోవటం తో మనస్తాపానికి గురైన అసిన్ కు త్రిష దెబ్బ పుండు మీద కారం చల్లినట్లు అయ్యిందట.
Thursday, March 17, 2011
అందాల ప్రియమణి కోరిక....
ప్రియమణి చాలా ఏళ్ళ కిందటే జాతీయ అవార్డు పొందిన తార. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం లైం లైట్ లో ఉన్న హీరొయిన్ లలో జాతీయ అవార్డ్ పొందిన ఏకైక నటి ప్రియమణి.
అటు అందాన్ని, అభినయాన్ని కలిగిఉన్నా ప్రియమణికి తగిన గుర్తింపు రాలేదనే చేప్పాలి. ఈ మద్య వస్తున్న సినిమా లలో బికిని లతో హాట్ గ మారి ఇతర హీరొయిన్ లకు పోటీని ఇస్తోంది. ప్రియమణి. ఆమె ప్రస్తుత కోరిక ఒకటేనట..అది ఎలాగైనా నెం వన్ అనిపించు కోవట మేనట. ప్రతి చిత్రం తోను వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్న తనకు ఆ అర్హత ఉండనే అంటోంది ప్రియమణి. సినిమాల్లో నిలబడాలంటే గ్లామర్ ఎంతైనా అవసరమనే అభిప్రాయాన్ని వ్యక్త పరిచింది. కథ డిమాండ్ మేరకు గ్లామర్ ని ప్రదర్శించడానికి తాను ఎప్పుడు సిద్ద మేనని మరోసారి స్పష్టం చేసింది ప్రియమణి. ఇంకో ఆసక్తి కరమైన అంశం ఏమిటంటే ప్రస్తుతం ఆమె బాలివుడ్ సినిమా ఫ్యాషన్ కు రీమక్ గా తెరకెక్కు తున్న ఓ చిత్రం లో నటిస్తోంది. ఫ్యాషన్ సినిమా కు గాను ప్రియాంక చోప్రా జాతీయ అవార్డ్ అందుకొంది. మరి ప్రియమణి కుడా మరోసారి జాతీయ అవార్డు అందు కొంటుందా... అంటే చూడాలి మరి మ రి అల్ ది బెస్ట్ ప్రియమణి.....
Tuesday, March 15, 2011
ఫిబ్రవరి14 కి అమర ప్రేమికులు మార్చ్14 కి విఫల ప్రేమికులు
ఈ ఇయర్ వాలెంటైన్స్ డే న టీవీ చూసారా...ఆరోజు అన్ని చానల్స్ లోను ఓ ప్రేమజంట కనువిందు చేసింది.. ప్రేమంటే తమదేనని లేచిపోయి పెళ్లి చేసుకొన్నా ఇప్పుడు ఇరు కుటుంబాల పెద్దల్ని ఒప్పించి అందంగా ఉంటున్నామని నవ్వుతూ చెప్పుకొన్నారు. ఆరోజు అందరు వింతగా చుసిన ఆ జంటే శిరీష్ భరద్వాజ్,శ్రీజల జంట. చిరజీవి కుమార్తె ఇంట్లో వాళ్లకి ఇష్టం లేని పెళ్లి చేసుకొందన్న విషయం తెలియగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తురువాత ఓ పాపా పుట్టిన తర్వాతా చిరు కుటుంబం వారిని ఆడరించిన్దనే వార్తలు వినిపించాయి. కొన్ని ఫంక్షన్ లలో శ్రీజ కనిపించింది. గత పిబ్రవరి 14 న మాత్రం వీరు వీర విహారమే చేశారు. తమ ప్రేమకథను అన్ని చానల్స్ లోను ప్లే చేసారు. సర్రిగ్గా నెల తిరిగింది అంతే తన భర్త,అతని కుటుంభ సభ్యులు కట్నం కోసం వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయించింది శ్రీజ. అరె నెల కిందటి వరకు బాగానే ఉన్నారు కదా! అప్పు డే ఏమైంది అని మరోసారి అందరిని ఆశ్చర్యంలో ముంచేసింది చిరు తనయ. మరి వీరి ప్రేమ,పెళ్లి కథ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి మరి........
Monday, March 14, 2011
కలిసి ఉండట్లేదు,విడిపోలేదు అంటున్న తార.....
తానూ ఒంటరిగా ఉంటున్న మాట వాస్తవమే అయిన గాని అలాగని తన భర్త నుంచి తానూ విడిపోతున్నానే వార్తలు నిజం కాదంటున్నారు భూమికా చావ్లా. కొన్ని పరిస్తుతుల్లో తానూ ముంభై లో ఉంటున్నానని భరత్ హైదరాబాద్ లో ఉంటున్నదాని భూమిక తెలిపారు. సినిమాలు ఫెయిల్ అవటం సాధారనమేనని ,వ్యాపారాల్లో నష్టాలు కూడా మామూలేనని భూమిక సెలవిచ్చారు. తన భర్తకు కోపం ఎక్కువని తానూ మాత్రం శాంత స్వభావినని భూమిక అన్నారు. భార్య,భర్తలు ఇద్దరి మనస్తత్వం ఒకే ఉండాలని ఎక్కడా లేదని ఆమె అంటున్నారు. ఇంత చేసినా తన భర్తతో తన సఖ్యత గురించి మాట్లాడలేదు ఆమె. తల్లి ఆరోగ్యం కోసమే తను ముంబై ఉంటున్నాని భూమికా తము విడిగా ఉండటానికి కారణాన్ని తెలిపారు. అయన ఎప్పుడు నా వెంటే ఉండటం సాధ్యమా అంటున్న భూమికకు గతంలో ఏ ఫంక్షన్ లో నైనా తలుక్కున మెరిసే తమ జంట గురించి గుర్తుకురాలేదంటారా..........
Sunday, March 13, 2011
మణిరత్నం,మహేష్ ల చిత్రం కాన్సెప్ట్ ఇదే.....
![]() |
కల్కి నవల ముఖ చిత్రం |

Monday, March 7, 2011
ఔను వాళ్ళిద్దరూ స్నేహం లో పడ్డారు......


Sunday, March 6, 2011
తన సినిమా ఎత్తేస్తున్నారని ఆత్మ హత్య యత్నం చేసిన యువ హీరో
థియేటర్ నుంచి తన సినిమా తొలగిస్తున్నారని,నిజంగా తన సినిమా ను ఎత్తేస్తే ఆత్మహత్య చేసుకొంటానని అదే థియేటర్ పైకి ఎక్కడో యువ హీరో. థియేటర్ పైకి ఎక్కి చాకు పట్టుకొని గొంతుకోసుకొంటానని బెదిరించాడు. దీంతో ఉల్లికిపడ్డ పోలీసులు ఫైర్ సిబ్బంది అతన్ని బతిమాలి కిందికి తీసుకొచ్చారు. బెంగళూరు లో ఓ థియేటర్ వద్ద ఈ సంఘటన జరిగింది. ఆ యువ కన్నడ హీరో పేరు హరీష్. హరీష్ స్వయంగా దర్శకత్వం వహించి నటించిన గన్ అనే సినిమా గత శుక్రవారం విడుదల అయ్యింది. సినిమా ఫ్లాఫ్ టాక్ తెచ్చుకొంది. ఇదిలా ఉండగా వచ్చే గురువారం మరో హీరో సుదీప్ నటించిన ఓ సినిమా రిలీజ్ కానుంది. దీంతో హరీష్ సినిమాను ఎత్తేస్తున్నామని థియేటర్ యాజమాన్యం అతడికి చెప్పారు. దీనిపై అతడు వారితో గొడవకు దిగాడు. కల్లెక్షన్లు లేక పోతే సినిమాను ఎలా ఆడిస్తామని థియేటర్ వారు ప్రశ్నించారు. దీంతో హరీష్ థియేటర్ పైకి ఎక్కి కలకలం సృష్టించాడు. చిత్ర రంగ ప్రముఖులు, మీడియా తనకు సహకరించటం లేదని,థియేటర్ యాజమాన్యం సినిమా రెండు వారాలు కూడా ఆడదంటు తన స్థైర్యాన్ని దెబ్బ తీస్తూందని హారీష్ విరుచుకుపడ్డాడు. కోట్ల రూపాయలతో సినిమా తీసిన తన గతి ఏం కావాలని ప్రశ్నించాడు. తానూ బతికి ప్రయోజనం లేదన్న హరీష్ ను పోలీసులు బలవంతంగా కిందికి దించారు. ఇంకా కొసమెరుపేంటంటే హరీష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్య యత్నానికి కాదు. హరీష్ ను దించుతున్నప్పుడు అతన్ని చేతిలోని చాకు ఓ పోలీసు కు తెగి గాయం అయ్యింది. అందుకు.....
Tuesday, March 1, 2011
ఎమ్,ఎమ్ ల కాంబినే షన్ అయ్యేనా సెన్సేషన్.....

Sunday, February 27, 2011
నాగార్జునకు అవార్డ్ తో ఎవరికి లాభం.....

Saturday, February 26, 2011
రజని కాంత్ తో నీళ్ళు తాగించిన రామ్ గోపాల్ వర్మ..........
టీవీ 9 రజినీకాంత్ అవతలి వాళ్ళను ఇరుకున పెట్టె ప్రశ్నలు అడిగి వారి వైపు విషపు నవ్వు చిందించటం ఇతని అలవాటు...తన ప్రశ్నలతో వారిని హింస పెట్టడం కుడా రజిని కాంత్ నైజం. అయితే తొలిసారి రజిని కాంత్ తను ఇంటర్వ్యూ చేసే వ్యక్తి చేతిలో చావుదెబ్బ తిన్నాడు. అతిధి గా వచిన్న ఆ వ్యక్తి మాటలతో రజని కాంత్ నీళ్ళునమిలాడు. రజినీకాంత్ పొగరును అనిచిన ఆ అతిధే రాంగోపాల్ వర్మ. టీవీ 9 వాళ్ళు వర్మ గురించి రామ్ ధమాల్ వర్మ పేరుతో వర్మ ఫై తీవ్రస్థాయిలో సెటైర్ లు వేశారు. దానిపై వర్మ కమిషనర్ ఏ కే ఖాన్ కు పిర్యాదు చేశాడు. అంతటితో వదిలేయాల్సిన అ విషయాన్ని టీవీ 9 మళ్లీ కెలికింది. వర్మను ఛానల్ కు పిలిపించి మళ్లీ చర్చ పెట్టింది. ఈ సారి గత ప్రోగ్రామ్‌లో పాల్గొన్న విశ్లేషకులనే పిలిపించి తాము చేసింది కరెక్ట్ అని నిరూపించుకోవాలని రజినీకాంత్ ప్రయత్నించాడు. అందరిమీద లాగే వర్మ మీద కూడా డ్యామినేషన్ చేయాలని చూసిన రజిని ప్రయత్నాలకు వర్మ మంచి సమాధానాలే ఇచ్చాడు. ప్రతి ప్రశ్నకు బుల్లెట్ లాంటి సమాధానాలు ఎటుతిరిగీ తమ ప్రోగ్రాం ను కరెక్ట్ అని కవర్ చేసుకోవాలన్న రజని ప్రయత్నాలు ఫలించలేదు. అసలు తన ఆలోచనలు తప్పు అని చీప్పడానికి టీవీ 9 ఎవరని వర్మ సూటిగా ప్రశ్నిన్చా డు . తానవి నెగిటివ్ ఆలోచనలు అనే నైతిక హక్కు టీవీ 9 కు లేదని ఉదయం లేస్తూనే టీవీ 9 చేసే పనేంటని సూటిగా ప్రశ్నించాడు. పెద్ద మానసిక వైధ్యుడినని చెప్పుకొనే యండమూరి వీరేంద్రనాథ్ కు గాలి తీసి పంపించాడు వర్మ. ఆఖరికి తనని తాను రక్షించు కొనే పనిలో పడిపోయాడు రజినీకాంత్. అందరిని తన మాటలతో ఆడుకొనే రజని కాంత్, వర్మ ముందు తేలిపోయాడు. అందుకే వర్మ లాంటి దారి తప్పిన మేధావులతో బీ కేర్ ఫుల్....
Thursday, February 24, 2011
''వారు నన్ను అవసరాలకు వాడు కొన్నారం''టున్న హీరొయిన్
తరచూ వివాదాస్పద ప్రకటనలతో వార్తల్లో ఉండే నటి లక్ష్మి రాయ్ ఇప్పుడు మరో సంచలన ప్రకటన చేశారు. చిత్ర సీమలోని కొందరు వ్యక్తులు తనను తమ అవసరాలకు వాడుకొన్నారని ఈమె అంటోంది. ఈ మాటలు ఇప్పుడు చర్చనీయా అంశాలు గా మారాయి. ఆవ్యక్తుల పేర్లు తను వెల్లడిన్ చలేనని కుడా ఈ భామ పేర్కొంది. తోటి నటులతో చెట్టపట్టాలు వేసుకు తిరుగుతుంది అని కూడా ఈమేకు పేరుంది. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ధోని తో ప్రేమాయణం సాగించిన లక్ష్మి రాయ్ ఆ తరువాత తాము స్నేహితులం మాత్రమేనని, అంతకు మించి తమ మధ్య ఏ లాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చింది. మళ్లి ఇప్పుడు ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు అన్నదో తెలియక చిత్రపరిశ్రమ పెద్దలు తలలు పట్టుకోన్ టున్నారు. మరో వైపు లక్ష్మి రేయ్ ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ ను పోగడ్తల తో ముంచేస్తోంది. కాని ఈమె ఒక విషయం గుర్తుంచుకోవాలి సచిన్ ధోని లాంటి వాడు కాదు..........
Wednesday, February 23, 2011
ఈ బుల్లెట్ తెలుగు లో కూడా కనిపించేనా.......
పద్మశ్రీ కమలహాసన్ కు జంటగా బాలివుడ్ క్రేజీ హీరోయిన్, షాట్ గన్ కూతురు సోనాక్షి సిన్హా నటించనుం ది అనేది తాజా వార్త ఏదేదో తమిళ సినిమా వార్త అని అనుకోకండి. తమిళం లో భారి స్థాయి లో తెరకెక్కుతున్న ఈ చిత్రం హిందీ, తెలుగులోకి డబ్ అవుతుంది దాన్ని మనం ఇంటరెస్టింగ్ గా చూస్తాం. దబంగ్ తో బాలివుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకొన్నా సోనాక్షికి అవకాశాలు వేల్లువేత్తు తున్నాయి. ఇంకో విశేషం ఏంటంటే కమల్ హాసన్ కు ఇప్పుడు 56 ఏళ్ళ. కమల్ కూతురు శ్రుతి కంటే సోనక్షి ఏడాది చిన్నది. సెల్వరాఘవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎలాగు సౌత్ లోకి వస్తున్నా ఈ బుల్లెట్ ను పవన్ కళ్యాన్ గబ్బర్ సింగ్ కు కూడా తీసుకొంటే బాగుంటుంది కదా.......
Sunday, February 20, 2011
విడిపోనున్న భూమిక దంపతులు..

Saturday, February 19, 2011
రీమాసేన్ వెడ్డింగ్ బెల్స్.....
రీమా సేన్ కు పెళ్లి కళ వచ్చేసింది.....మనసంతా నువ్వే అంటూ తెలుగు వారికి పరిచయం అయిన ఈ బెంగాలి భామ పెళ్ళికూతురు కాబోతోంది. త్వరలోనే రీమాసేన్ వెడ్డింగ్ బెల్స్ మొగించనుంది. డిల్లీ కి చెందినా వ్యాపారవేత్త శివ కరణ్ సింగ్ ను రీమాసేన్ వివాహమాడనుంది. గత బుధవారం రాత్రి వీరి నిశ్చితార్థం ఘంగా జరిగింది. రీమ కు ఆమె ప్రియుడే తొలుత లవ్ ప్రపోజ్ చేశాడట. ఆమె కూడా ఓ కే అనటంతో వీరి పెళ్ళికి గ్రీన్ కార్డు పడింది . అందరికి వెడ్డింగ్ కార్డు అందించే పనిలో పడింది రీమాసేన్. తాము తొలి ప్రేమ మాధుర్యాన్ని అనుభవిస్తున్నామని పెళ్ళికి ఇంకా తేది ఖారారు చేయలేదని శివ కరణ్ అంటున్నారు.
Thursday, February 17, 2011
వారిది హీరొయిన్ ల కుటుంబం కూడా....

Wednesday, February 16, 2011
రాణా లో ముగ్గురు రజినీకాంత్ లు.....


Tuesday, February 15, 2011
7/g దర్శకుడు సెల్వరాఘవన్ రెండోపెళ్ళి

ప్రస్తుతం సోనీ సినిమా లతో బిజీ గావుండగా రాఘవన్ రెండో పెళ్ళికి ముహూర్తం పెట్టుకొన్నాడు. తన దగ్గరే సహాయకురాలిగా పని చేస్తున్న గీతాంజలి ని సెల్వ వివాహం చేసుకోనున్నాడు. ఈ మద్యనే చెన్నై లో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. దీనికి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సకుటుంబ సపరివారంగా హాజరయ్యారు. సెల్వ తో ఒక సినిమా చేసినా వెంకటేష్ కుడా వీరి నిశ్చితా ర్థానికి హాజరయ్యాడు. ఇంకో విశేషం ఏంటంటే సెల్వరాఘవన్ మొదటి వివాహానికి కూడా వీరందరూ హాజరయ్యారు. రాఘవన్, గీతాంజలిల వివాహం జూన్ ౩ న జరుగనుంది.
Monday, February 14, 2011
త్యాగశీలి వమ్మా లలితా...

Friday, February 11, 2011
మన హీరోల చూపు కోలివుడ్ వైపు...
మన హీరో లకు జ్ఞానోదయం అయ్యింది. ఇన్ని రోజులు తెలుగుకే పరిమితం అయిన మన హీరోల చిత్రాలు ఇక నుంచి తమిళం లో కూడా మార్కెట్ చేయనున్నాయి. తాజాగా తెలుగు హీరో జూనియర్ NTR తమిళ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన తాత,దివంగత నటుడు రామారావు ప్రారంభం లో కొన్ని తమిళ చిత్రాల్లో నటించారు. ఆతరువాత ఆయన తెలుగు తెరకే పరిమితం అయ్యారు. కాని నాగార్జున వంటి కొంతమంది హీరోలు తమిళ ప్రేక్షకులను పలకరించి వచ్చారు. నాగార్జున 'శివ' తమిళంలో 'ఇదయం తిరుదాడే'పేరుతొ విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకొంది. 'గీతాంజలి' కూడా తమిళ్లోకి అనువాదమైంది. చాలా రోజుల తర్వాత నాగార్జున తమిళ్లో నటించిన 'రాక్షగాన్' ఫెయిల్ అవ్వటంతో మళ్ళి తమిళ్ జోలికి వెళ్ళలేదు. కాని ఆయన చిత్రాలు మాత్రం తమిల్లోకి అనువాదం అయ్యేవి. ఈ మధ్యకాలంలో మహేశ్ బాబు 'అతడు' తమిళ్లో మంచి హిట్ కొట్టింది. ఇప్పుడు మళ్లీ నాగార్జున 'గగనం' చిత్రం 'పయనం' పేరుతో విడుదల అవుతుంటే. తారక్ నటిస్తున్న 'శక్తి' తెలుగు,తమిళం భాషల్లో ఒకే సారి విడుదల అవ్వటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా లో ఇలియానా హీరోయిన్. తమిళ హీరోలు అనువాద చిత్రాలతో తెలుగు తెరపైకి దండెత్తుతుంటే కనీసం మన వాళ్ళు ఇప్పటికైనా మేల్కోవటం సంతోషమే కదా!
Sunday, January 30, 2011
నగరం నిద్రపోతున్నపుడు వారు కలిశారు!
'అనుకోకుండా ఒకరోజు' చూస్తే.. ఎప్పుడు స్నాక్స్ తింటూ ఓ వ్యక్తి కనిపిస్తారు. గుర్తుందా..? అందులో హీరోయిన్ చార్మిని రక్షిస్తారు. ఇపుడు ఆ ఇద్దరు .. అంటే జగపతి, ఛార్మి హీరో , హీరోయిన్లుగా తొలిచిత్రం (అందులో హీరో కాదు) రాబోతుంది. ఇగోలు లేని హీరోగా పేరుపొందిన జగపతిబాబుతో నటించడానికి చార్మి ఆసక్తి కనబరిచినట్లు సమాచారం. తాజాగా పరుచూరి బ్రదర్స్ సంభాషణలు రాస్తున్న ఆ చిత్రం పేరు 'నగరం నిద్రపోతున్న వేళ'. ఈచిత్రానికి వారి శిష్యుడు ప్రేమ్‌రాజ్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఇండస్ట్రీ బంద్ వల్ల కొంత షూటింగ్ జరిగి వాయిదా పడింది. ఈనెల 17న తర్వాత మలి షెడ్యూల్ మొదలైంది. జగపతిబాబు, చార్మికాంబినేషన్లో కొన్ని సన్నివేశాలతోపాటు ఓ పాటను చిత్రించినట్లు తెలిసింది. ఇప్పటికే 40 శాతం పూర్తయినది. ఈ చిత్రాన్ని ప్రముఖ రియల్టర్ నంది శ్రీహరి నిర్మిస్తున్నారు
charmi, jagapathi babu
Saturday, January 29, 2011
దొంగల ముఠా : 5 రోజులు, 5 మంది దర్శకులు
రామ్ గోపాల్ వర్మ త్వరలో "దొంగల ముఠా" చిత్రానికి వర్మ కాక ఐదు గురు డైరక్టర్లు పనిచేయనున్నారు .వీరు పూరీ జగన్నాధ్, వివి వినాయిక్, గుణశేఖర్,హరీష్ శంకర్, కృష్ణ వంశీ అంటున్నారు. వీరు ఐదుగురుకీ ఐదు యూనిట్స్ ని కేటాయిస్తారని, ఎవరు పని వారు పూర్తి చేసుకుంటూ వెళ్తారని, కాంబినేషన్ సీన్స్ ను జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. రామ్ గోపాల్ వర్మ ఈ ఐదుగురుని కో ఆర్డనేట్ చేస్తారు.
కొసమెరుపు : ఇక ఆ ఐదు రోజులు మీడియా చేసే హడావిడి చూడలేక చావాలి మనం.
Thursday, January 27, 2011
శ్రీరామరాజ్యం విడుదల జూన్ 10
నందమూరి బాలకృష్ణ, ప్రముఖ దర్శకుడు బాపు కాంబినేషన్ లో రూపొందుతున్న "శ్రీరామ రాజ్యం" చిత్రం జూన్ 10వ తేదీన విడుదల కానుంది. గతంలో రామారావు గారు నటించిన లవకుశ కళాఖండాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ దృశ్య కావ్యాన్ని తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు బాపు తెలిపారు. ఆ లవకుశ కంటే శ్రీరామ రాజ్యం గొప్పగా ఉంది అని ప్రేక్షకులు కొనియాడేలా ఈ సినిమా ఉంటుందని ఆయన చెప్పారు. శ్రీరాముని జననం నుంచి రావణాసుర సంహారం వరకూ పదినిషాల పాటలో ఆ కథంతా చూపడం సినిమాలో ప్రత్యేక ఆకర్షణ.
కొసమెరుపు: బాలయ్యను ఆ శ్రీరాముడు కరునిస్తాడా
balakrishna, sriramarajyam
Wednesday, January 26, 2011
తెలుగు తెరపై కొత్త మొహాలు (ఫోటోలు)
ఇతరభాషల నుంచి హీరోయిన్ల దిగుమతి మనకు కొత్త కాదు. కానీ ఈ మద్య కొన్నినెలల తేడా తోనే చాలా కొత్త మొహాలు కనిపించాయి. వీరిలో కొందరు ఇప్పటికే ఇతర భాషల్లో సినిమాలు తీస్తుండగా.. ఇంకొందరు కొత్తవాళ్ళు. ఆ అందాలు దృశ్యరూపం లో మీ కోసం.
చూడండి, డౌన్ లోడ్ చేయండి.
చూడండి, డౌన్ లోడ్ చేయండి.
alisha pekha
Garima parnami
Megnaraj
Moulshree sachdeva
Naga sourya
Piaa Bajpai
Sakshi Gulati
Archana gupta
Subscribe to:
Posts (Atom)